: నేను హామీ ఇస్తే తప్పకుండా చేస్తా: గడ్కరీ
ఇవాళ విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తన ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఇంతవరకు ఎవరూ అనలేదని చెప్పారు. తాను చెప్పిందే చేస్తానని... చేసేదే చెబుతానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ఏపీకి ప్రకటించిన ప్రాజెక్టులన్నీ తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఏపీ రాజధాని అమరావతిలో ఎయిర్ పోర్టుల స్థాయిలో బస్ పోర్టులు నిర్మించాలనేది తమ ప్లాన్ అన్నారు. ఇందుకు ఏపీ ముందుకొస్తే దానికి కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నారు. బకింగ్ హామ్ కెనాల్ పునరుద్ధరణకు సర్వే జరుగుతోందని, వచ్చే ఏడాది కల్లా కెనాల్ కు సంబంధించి పనులు మొదలుపెడతామని గడ్కరి వెల్లడించారు.