: ఎలుగుబంటి 'ఛోటూ'కు కారుణ్య మరణం


పక్షవాతం వల్ల గత మూడేళ్లుగా అచేతనంగా పడి ఉన్న ఎలుగుబంటి ఛోటూకు ఈ రోజు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తున్నారు. ఛోటూ వయసు 35 సంవత్సరాలు. ఇది హిమాలయన్ రకానికి చెందినది. ఇండోర్ జూలోనే పుట్టి, అక్కడే ఉంటోంది. ఛోటూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అత్యుత్తమ వైద్యులతో చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కలేదు. వృద్ధాప్యంలో ఉన్న ఛోటూ ఇక కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పారు. దీంతో, కారుణ్య మరణం ప్రసాదించాలని సెంట్రల్ జూ అథారిటీ నిర్ణయించింది. ఛోటూ పుట్టినప్పటి నుంచి దాన్ని జీవన్ దాదా అల్లారుముద్దుగా సాకాడు. దీంతో, ఛోటూకు కారుణ్య మరణం ప్రసాదిస్తున్న తరుణంలో, అతను అంతులేని వేదనను అనుభవిస్తున్నాడు. కారుణ్య మరణం ప్రసాదించాలనే నిర్ణయాన్ని తొలుత జీవన్ దాదా తిరస్కరించాడు. అయితే, ఇక ఛింటూ కోలుకోవడం కష్టమని జీవన్ దాదాను వైద్యులు ఒప్పించారు. ఈ క్రమంలో, దానికి ఎలాంటి నొప్పి కలగని విధంగా ఎన్జీవోలు, జూ అధికారుల సమక్షంలో వైద్యులు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News