: తిరుమలలో చైనా పారిశ్రామికవేత్తలు


ఆంధ్రప్రదేశ్ లో కార్ల తయారీ సంస్థను నెలకొల్పే విషయమై ప్రభుత్వంతో చర్చించేందుకు వచ్చిన చైనా పారిశ్రామికవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా వారిని వెంటబెట్టుకుని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ, కార్ల తయారీ సంస్థను ఏపీలో పెట్టడానికి చైనా పారిశ్రామికవేత్తలు సంసిద్ధతను వ్యక్తం చేశారని చెప్పారు. ఏపీలో మూడు ప్రాంతాలు పరిశ్రమలు స్థాపించడానికి చాలా అనువుగా ఉంటాయని తెలిపారు. రానున్న రోజుల్లో చైనా పారిశ్రామికవేత్తలు మరిన్ని సంస్థలను పెట్టబోతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News