: అన్నం బాగా లేదన్నందుకు అమ్మాయిలపై లేడీస్ హాస్టల్ యాజమాన్యం దాడి


సుదూర ప్రాంతాల నుంచి విద్య, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాదుకు వచ్చిన యువతులు వారంతా. హైదరాబాదులోని మధురా నగర్ లో పుట్టగొడుగుల్లా వెలసిన లేడీస్ హాస్టళ్లే వారికి దిక్కు. ఇబ్బంది అనిపించినా వాటిలోనే ఉంటూ పెద్ద సంఖ్యలో యువతులు తమ తమ పనులు చేసుకుపోతున్నారు. ఎక్కడి నుంచో వచ్చారు కదా, ఏ భోజనం పెట్టినా సరిపోతుందిలే అనుకున్నారో, ఏమో... దండిగా డబ్బులు లాగేస్తూనే హాస్టళ్ల నిర్వాహకులు నాసిరకం భోజనం పెడుతున్నారు. దీంతో కడుపు మండిన అమ్మాయిలు అన్నం బాగా లేకపోతే ఎలాగంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. అంతే, పెట్టింది తినకుండా మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ నిర్వాహకులు రెచ్చిపోయారు. అమ్మాయిలను గదిలో నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. మధురానగర్ పరిధిలో నిన్న రాత్రి ఓ లేడీస్ హాస్టల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్వాహకుల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News