: కోలుకుంటున్న పారిస్...తిరిగి తెరుచుకున్న బెన్నో బైర్ కేఫే


ఉగ్రవాద దాడుల నుంచి పారిస్ నెమ్మదిగా కోలుకుంటోంది. నవంబర్ 13న ఉగ్రవాదులు పారిస్ నగరంపై విరుచుకుపడి 130 మందిని వివిధ ప్రాంతాల్లో బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పారిస్ వాసులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. నెమ్మదిగా ఆనాటి చేదు జ్ఞాపకాల నుంచి పారిస్ వాసులు బయటపడుతున్నారు. ఆనాడు తీవ్రవాదులు దాడులు చేసిన బెన్నో బైర్ కేఫే తిరిగి తెరుచుకుంది. ఈ సందర్భంగా కేఫే షాప్ బయట పుష్పగుచ్ఛాలు ఉంచి ఆనాటి మృతులకు నివాళులర్పించారు. ఆనాడు కేఫేలో జరిపిన దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, కేఫే ధ్వంసమైంది. దానిని పునరుద్ధరించిన కేఫే యజమానులు తిరిగి తెరిచారు.

  • Loading...

More Telugu News