: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ప్లాంట్లకు ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సౌర, పవన విద్యుత్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుజ్లాన్, యాక్సీస్ సంస్థలతో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన వారికి సూచించారు. అలాగే అమరావతిలో ఇంధన యూనివర్సిటీ ఏర్పాటులో సహకరిస్తామని సుజ్లాన్ కంపెనీ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చింది. వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తితో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్, తాజా ఒప్పందాలతో ఇతర రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చే రాష్ట్రంగా అవతరించనుందనడంలో అతిశయోక్తి లేదు.