: మేం మీ ముందుకు వస్తున్నాం... మన చెన్నైని ఆదుకుందాం: రానా, నవదీప్


చెన్నై వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ నటీనటులు ముందుకు వస్తున్నారు. భారీ వర్షాల ధాటికి నీట మునిగిన చెన్నై వాసులకు ఆపన్న హస్తం అందించేందుకు యువ సినీ నటులు సిద్ధమవుతున్నారు. వీరంతా గ్రూపుగా తయారై అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చెన్నైకి ఆహార సామగ్రిని ట్రక్కుల్లో పంపించారు. మరింతమంది సినీ నటులు వీరికి సహాయం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సినీ నటుడు నవదీప్ ఆధ్వర్యంలో వీరంతా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు నడుంబిగించారు. చెన్నై వాసులకు ఎవరైనా సహాయం చేయాలని భావిస్తే హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ కు తమ ఆపన్న హస్తం అందించాలని రానా, నవదీప్ తెలిపారు. అలాగే ఆదివారం ఇనార్బిట్ మాల్ తదితర ప్రాంతాలకు విరాళాలు సేకరించేందుకు నేరుగా తామే వస్తామని రానా చెప్పాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు అంతా ముందుకు రావాలని రానా, నవదీప్ పిలుపునిచ్చారు. వీరికి టాలీవుడ్ నుంచి యువనటీనటులంతా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News