: 'బాహుబలి'కి తల్లి ఎవరయ్యేను?


వరుస విజయాలను తన ఇంటి పేరుగా మార్చుకున్న టాలీవుడ్ డైరక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఈ సూపర్ డైరక్టర్ ఏ సినిమా తీసినా దేనికదే ప్రత్యేకమైనదే. తొలి సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్' దగ్గర్నుంచి నిన్నటి 'ఈగ' వరకు అదే ట్రెండ్ ఫాలో అయ్యాడీ పని రాక్షసుడు. తాను అనుకున్నది రాబట్టే వరకు విశ్రమించడని పేరున్న రాజమౌళి, తాజాగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్ కథానాయకుడైతే, రానా ప్రతినాయకుడు!

ఆర్కామీడియా నిర్మిస్తోన్న ఈ జానపద చిత్రంలో ప్రభాస్, రానాలు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ తోనే సగం హిట్ కొట్టిన రాజమౌళికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. ప్రధాన పాత్రధారులు ఇద్దరూ ఆజానుబాహులే కావడంతో వీరిద్దరికీ తల్లిగా ఎవరని ఎంపిక చేయాలన్న దానిపై ప్రస్తుతం రాజమౌళి, నిర్మాత దేవినేని ప్రసాద్ కసరత్తులు చేస్తున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ లు ప్రస్తుతానికి 'బాహుబలి' తల్లి పాత్రకు రేసులో మిగిలారు.

అయితే, వీరిద్దరిలో ఎవరివైపు మొగ్గాలో రాజమౌళి తేల్చుకోలేకపోతున్నాడట. పైగా, శ్రీదేవి, సుస్మితా ఇద్దరూ కూడా కోటికిపైగా డిమాండ్ చేస్తుండడమూ దర్శకనిర్మాతలను ఆలోచనలో పడేసింది. సుస్మితాకు ఇటీవల పెద్దగా చిత్రాలేమీ లేకపోగా, శ్రీదేవి మాత్రం 'ఇంగ్లిష్ వింగ్లిష్' తో హిట్ కొట్టేసింది. నటిగానూ శ్రీదేవే బెటరన్నది ఎవరిని అడిగినా చెబుతారు. దీంతో, 'బాహుబలి'కి తల్లిగా శ్రీదేవికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News