: మొబైల్ ఫోన్లపై బీహార్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఆంక్షలు


బీహార్ శాసనసభ్యులు సెల్ ఫోన్ వాడకంపై అసెంబ్లీలో స్పీకర్ విజయ్ చౌదరి ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మొబైల్ ఫోన్లు వాడడం సభా గౌరవానికి భంగం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు, గవర్నర్ మాట్లాడేటప్పుడు కూడా కొందరు సభ్యులు మొబైల్ ఫోన్ వాడడం చూశానని, అది గౌరవం కాదని ఆయన స్పష్టం చేశారు. సభ వెలుపల సభ్యుల మొబైల్ ఫోన్లను ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు. అక్కడ మొబైల్ పెట్టడం ఇష్టం లేని ఎమ్మెల్యేలు సభ వెలుపల మొబైల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకుని సభలోకి ప్రవేశించవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News