: ఇతరులలానే మేమూ పన్నులు చెల్లిస్తాం: జుకర్ బర్గ్


కుమార్తె పుట్టిన వేళ ఫేస్ బుక్ కంపెనీలోని తన వాటాలో 99 శాతం (దాదాపు రూ.3 లక్షల కోట్లు) షేర్లను జుకర్ బర్గ్ వితరణగా ప్రకటించడంపై పలువురి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. పన్నుల నుంచి మినహాయింపుల కోసమే వారు ఇలా చేసినట్టు వస్తున్న ఆరోపణలపై జుకర్ స్పందించారు. విరాళంగా ఇవ్వడం ద్వారా తాను కానీ, తన భార్య ప్రిసిల్లా చాన్ కానీ ఎలాంటి పన్ను మినహాయింపులు పొందబోమని తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు. తమ షేర్లను అమ్మినప్పుడు ఇతరుల మాదిరిగానే పన్నులు చెల్లిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News