: చెన్నై నుంచి బయటపడాలంటే...!
భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై మహా నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. నిన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. చెన్నై వీధులన్నీ వరదనీటి మయమవడంతో కదలలేని పరిస్థితి నెలకొంది. ఈరోజు నుంచి కొద్దొగొప్పో కొన్ని సబర్బన్ రైళ్లను, లిమిటెడ్ విమాన సర్వీసులను ప్రారంభించారు. అత్యవసర పనుల నిమిత్తం చెన్నై నుంచి బయటపడాలనుకున్న వారి కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) రంగం సిద్ధం చేసింది. వాయుమార్గం ద్వారా వారిని తరలించేందుకు విమానాలను సిద్ధం చేసింది. ఈ సేవలను వినియోగించుకోదలచిన వారు తాంబరంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో సంప్రదించాల్సిందిగా ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. వయా అరక్కోణం మీదుగా వారిని వాయుమార్గం ద్వారా తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. తాంబరం ఎయిర్ స్టేషన్ కు సులభంగా చేరుకునే మార్గాన్ని కూడా అధికారులు చెప్పారు. ఎంఆర్టీఎస్ రైళ్ల ద్వారా బీచ్ స్టేషన్ నుంచి తాంబరం వరకు ప్రయాణించాలన్నారు. ఈ సందర్భంగా తాంబరం ఎయిర్ స్టేషన్ లో సంప్రదించాల్సిన వారి వివరాలను ఐఏఎఫ్ అధికారులు పేర్కొన్నారు. తాంబరంలో... వింగ్ కమాండర్ చౌదరి, ఫోన్ నంబర్: +91-9445812038 చెన్నైలో... మేజర్ సూర్యకుమార్, 17 Jat. ఫోన్ నంబర్: +91-8394000074 ఎంఈజీ అధికారులు... మేజర్ రాజేష్, ఫోన్ నంబర్: +91-7259988778 మేజర్ ఆర్బిట్, ఫోన్ నంబర్: +91-8393881102.