: సహనం చూపించేందుకు హిందువులు కల్యాణి బిర్యానీ తినాల్సి ఉంటుంది: ఒవైసీ


ముస్లింలు సహనం చూపించేందుకు పంది మాంసం తిని చూపించాలని త్రిపుర గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. సహనం చూపించేందుకు హిందువులు కల్యాణి (బీఫ్) బిర్యానీ తినాల్సి ఉంటుందని తాను అంటే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పప్పుల ధర కంటే బీఫ్ ధర తక్కువగా ఉన్నప్పుడు పేదలు అదే తింటారని చెప్పారు. హిందుస్థాన్ హిందువులదని... ముస్లింలు పాకిస్థాన్ వెళ్లి పోవాలని గవర్నర్ ఎలా వ్యాఖ్యానిస్తారని అన్నారు. ఈ దేశం అందరిదీ అయినప్పుడు తాము పాకిస్థాన్ ఎందుకు వెళతామని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News