: పార్టీలు మారే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది: కేటీఆర్


టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారందరూ వారి ఇష్ట ప్రకారమే వస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. వారిని భయపెట్టో, బలవంతపెట్టో తాము పార్టీలోకి చేర్చుకోవడం లేదన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ ఎస్ పార్టీలో చేరికలపై ఒక విలేకరి ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. టీఆర్ఎస్ లో చేరుతున్న వారు పిల్లలో, తక్కువ స్థాయి నేతలో కాదన్నారు. 'మంత్రులుగా, ప్రజా ప్రతినిధులుగా ఎంతో అనుభవం గడించిన వారున్నారు. అలాంటి వారిని బెదరింపులతో పార్టీలోకి లాక్కోవడం ఎలా సాధ్యమో మీరే చెప్పాలి' అంటూ ఆ విలేకరిని కేటీఆర్ తిరిగి ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు మారే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని మంత్రి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News