: నాలుగు పరుగుల తేడాతో రెండో వికెట్ కోల్పోయిన సఫారీలు
భారత్ తో జరుగుతున్న చివరి టెస్టులో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ తడబడుతోంది. కేవలం నాలుగు పరుగుల తేడాతో రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 36 పరుగుల వద్ద ఎల్గర్ ఔట్ కాగా, 40 పరుగుల వద్ద బవుమా పెవిలియన్ చేరాడు. 22 పరుగులు చేసిన బవుమాను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. సౌతాఫ్రికా ప్రస్తుత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు. ఆమ్లా (2), డీవిలియర్స్ (8) క్రీజులో ఉన్నారు. అయితే, భారత స్పిన్నర్ల ధాటిని వీరు ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి.