: తగ్గిన అడయార్ నది ఉద్ధృతి... జలదిగ్బంధం నుంచి బయటపడుతున్న కాలనీలు


భారీ వర్షాలతో నిండిపోయిన చెన్నైలోని అడయార్ నది కొద్ది కొద్దిగా శాంతిస్తోంది. వర్షం తెరిపివ్వడంతో మూడు రోజుల పాటు వందల కాలనీలను నీటితో ముంచేసిన ఈ నది ప్రవాహం తగ్గుతోంది. దాంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. చెంబరంపాకం, కత్తిపార, గిండి, సైదాపేట ప్రాంతాలలో నీరు తగ్గిపోయింది. ఈ క్రమంలో ప్రజలు నిత్యావసరాల కోసం రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. అయితే నాలుగు రోజుల నుంచి విద్యుత్ లేకపోవడంతో చెన్నై నగరమంతా అంధకారమైంది.

  • Loading...

More Telugu News