: 334 పరుగులకు భారత్ ఆలౌట్
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 334 పరుగులకు ఆలౌటయింది. రహానే 127 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, అశ్విన్ 56 పరుగులతో సత్తా చాటాడు. కోహ్లీ 44 పరుగులు, ధావన్ 33, జడేజా 24, పుజారా 14, మురళీ విజయ్ 12, రోహిత్ శర్మ 1, సాహా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. ఇశాంత్ శర్మ డకౌట్ కాగా, ఉమేష్ యాదవ్ 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో అబాట్ 5 వికెట్లు, పెడిట్ 4 వికెట్లు తీయగా తాహిర్ ఒక వికెట్ తీశాడు. దక్షిణాఫ్రికా జట్టు తన బ్యాటింగ్ ను ప్రారంభించింది.