: బ్యాట్ తో సత్తా చాటిన అశ్విన్... అర్ధ శతకం పూర్తి
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇప్పటి దాకా బంతితో మాయాజాలం చేసిన అశ్విన్... ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్ట్ లో బ్యాట్ కు పని కల్పించాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసిన అశ్విన్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 116 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు, లాంగ్ ఆన్ మీద కొట్టిన సిక్స్ తో అతను ఈ ఫీట్ సాధించాడు. మరోవైపు, సెంచరీ హీరో రహానే 127 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం అశ్విన్ (53), ఉమేష్ యాదవ్ (5) క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు.