: ప్రధాని ఏరియల్ సర్వే ఫోటోలో పీఐబీ మార్పులు... ఫోటోషాప్ చేసిన ఫోటో పోస్ట్ చేసి విమర్శలు


దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటో విషయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చూపిన అత్యుత్సాహం పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. చెన్నైలో భారీ వర్షాలు, వరదలు రావడంతో నిన్న (గురువారం) అక్కడ ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ లో తిరుగుతూ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తరువాత పీఐబీ విడుదల చేసింది. ఆ ఫోటోలు కాస్తా వివాదానికి దారి తీశాయి. సాధారణంగా ఏరియల్ వ్యూలో విమానంలో నుంచి చూస్తే కింద అంతా సువిశాలంగా కనిపిస్తుంది. భవనాలు, పరిసరాలు అంత స్పష్టంగా కనిపించవు. అయితే ప్రధాని హెలికాప్టర్ లోని గుండ్రని కిటికీలో నుంచి కనపడే సాధారణ దృశ్యం స్థానంలో బాగా క్లోజప్ లో తీసిన ఓ ఫోటోను ఫోటో షాప్ లో అతికించి దాన్ని ట్విట్టర్ లో పీబీఐ వారు పెట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతాదారులు కనిపెట్టి కామెంట్లు, సరదా ఫోటోలతో విమర్శలు చేశారు. తరువాత గమనించిన పీఐబీ తన తప్పును సరిచేసుకుని అసలు ఫోటోను మళ్లీ పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News