: అమిత్ షాకు అండగా ఆర్ఎస్ఎస్
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఈ నెలతో అమిత్ షా పదవీ కాలం ముగుస్తోంది. దీంతో, నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, అమిత్ షాను తప్పించడానికి కొందరు సీనియర్ నేతలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. అయితే, అమిత్ షాను మార్చడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అమిత్ షా కష్టపడే మనస్తత్వం కలవాడని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. అమిత్ షా నాయకత్వంలోనే హర్యాణ, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్ వంటి చోట్ల బీజేపీ విజయాలు సాధించిందని చెబుతోంది. అంతేకాకుండా, బీహారు ఓటమికి సామాజిక, రాజకీయ సమీకరణాలే కారణమని ఆర్ఎస్ఎస్ విశ్లేషణలో తేలింది. ఈ నేపథ్యంలో, బీజేపీ అధినేతగా అమిత్ షా మరోమారు ఎంపిక కావడం తథ్యమని తెలుస్తోంది.