: గూగుల్ సీఈఓ హోదాలో సుందర్ పిచాయ్... తొలి విదేశీ పర్యటన స్వదేశానికే!


భారత నగరం చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ కార్పొరేట్ దిగ్గజం గూగుల్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టి సత్తా చాటారు. గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుందర్ పిచాయ్ ఇప్పటిదాకా అమెరికాను వదిలి బయటకు రాలేదు. సొంతూరును కూడా చూడలేదు. అయితే ఈ నెలాఖరులో ఆయన భారత్ వస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. గూగుల్ సీఈఓగా తొలి విదేశీ పర్యటన కోసం పిచాయ్ తన స్వదేశానికే వస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News