: చెన్నయ్ లో లీటర్ పాలు 150/-... నీళ్ల క్యాన్ 250/-


హుదూద్ తుపాను సందర్భంగా విశాఖపట్టణంలో చోటుచేసుకున్న సంఘటనలు ఇప్పుడు చెన్నైలో చోటుచేసుకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, తొలి అంతస్తును ముంచేసిన వాననీరు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఎటు వెళ్లాలో తెలియక చెన్నై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మానవతతో స్పందించాల్సిన ప్రస్తుత తరుణంలో బాధితుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో చెన్నైలో గుక్కెడు నీళ్లు, అవసరమైన పాలు కూడా దొరకక అల్లాడుతున్నారు. లీటర్ పాల ధర 100 రూపాయల నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే 25 లీటర్ల వాటర్ క్యాన్ ను 250 రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక నిత్యావసర వస్తువులు, పెట్రోలు వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయని ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదని బాధితులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News