: చైనాలో మరో గాజు వంతెన రికార్డులకు ఎక్కుతోంది!


చైనా మరో గాజు వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. భూమికి 984 కిలోమీటర్ల ఎత్తులో 1,411 మీటర్ల పొడవుతో జాంగ్జియాజి ప్రాంతంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇక.. ఈ వంతెన ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఒకేసారి 800 మంది సందర్శకులు ఈ బ్రిడ్జిపై నడిచినప్పటికీ వంతెనకు ఎటువంటి పగుళ్ళు ఏర్పడవు. ప్రపంచంలోనే ఎత్తైన, పొడవైన గాజు వంతెనగా ఇది ఇప్పటికే రికార్డుల కెక్కింది. కాగా, షింజు హై నేషనల్ పార్కులో గతంలో ఒక గాజు వంతెనను చైనా నిర్మించింది. అయితే, దీనికి పగుళ్లు రావడంతో ఈ వంతెనపైకి సందర్శకులను అనుమతించడం లేదు. ప్రస్తుతం ఈ వంతెన మరమ్మతులు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News