: ఫుట్ బాల్ లో ర్యాంకు మెరుగుపరచుకున్న భారత్
భారత ఫుట్ బాల్ జట్టు ఆరు ర్యాంకులు మెరుగుపరుచుకుంది. ప్రపంచ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ ను స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నగరంలో విడుదల చేశారు. గత నెల 2018లో ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీల్లో పాల్గోనే జట్ల కోసం గత నెల అర్హత పోటీలు నిర్వహించగా, భారత జట్టు పేలవమైన ఆటతీరుతో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో 172వ స్థానానికి పడిపోయింది. ఆ తరువాత నిలకడైన ఆటతీరు ప్రదర్శించడంతో ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 166వ స్థానంలో నిలిచింది. గత నెలలో అగ్రస్థానం కైవసం చేసుకున్న బెల్జియం ఈ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. తరువాతి ర్యాంకుల్లో అర్జెంటీనా, స్పెయిన్, జర్మనీ ఫుట్ బాల్ జట్లు నిలిచాయి.