: పశ్చిమ దేశాలను విమర్శిస్తూ మనం తప్పించుకోకూడదు: మేనకాగాంధీ


వాతావరణ కాలుష్యానికి కారణం పశ్చిమానికి చెందిన అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలే అంటూ తప్పించుకోకూడదని కేంద్ర మంత్రి మేనకాగాంధీ హితవు పలికారు. వాతావరణ కాలుష్యంలో భారత్ పాత్రను విస్మరించలేమని ఆమె పేర్కొన్నారు. మన దేశంలో కూడా మిథేన్ ఉత్పత్తి అధికంగా జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కార్బన్ డై ఆక్సైడ్ తో పోలిస్తే మిథేన్ కారణంగా కాలుష్యం అధికమవుతోందని ఆమె పేర్కొన్నారు. చెన్నైలో కురుస్తున్న వర్షాల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. రానున్న పదేళ్లలో ఊహించని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News