: సంజయ్ దత్ కు ఆర్నెల్ల జైలుశిక్ష తగ్గింపు?


అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్, ప్రస్తుతం పూణె లోని ఎరవాడ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. కాగా, సత్ప్రవర్తన కింద సంజయ్ దత్ జైలు శిక్షా కాలాన్ని సుమారు ఆరు నెలల పాటు తగ్గిస్తారన్న విషయాన్ని 'మహారాష్ట్ర టైమ్స్' ప్రచురించింది. సత్ప్రవర్తన కనబరిచే ఏ ఖైదీకైనా శిక్షా కాలం తగ్గిస్తారు. ఈ నేపథ్యంలో ఈ క్లాజ్ కు సంబంధించిన వివరాలను జైలు అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. జైలు నియమావళికి సంబంధించి ఉన్న ఈ క్లాజ్ ప్రకారం.. ఖైదీ సత్ప్రవర్తనతో వ్యవహరించినా, జైలులో పని చేసేందుకుగాను సదరు ఖైదీ ఎంచుకున్న రంగంలో మంచి పనితీరు కనబరచినా శిక్ష తగ్గింపు వర్తిస్తుంది. ఆ విధంగా సంజయ్ శిక్ష తగ్గింపుకి అర్హత పొందాడని,దీని కారణంగా తాను జైలు నుంచి విడుదలవ్వాల్సిన వాస్తవ తేదీ కన్నా ఆరు నెలల ముందుగానే విడుదలవుతాడని కూడా ఆ పత్రిక పేర్కొంది. కాగా, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో మే 21, 2013లో సంజయ్ దత్ జైలుకు వెళ్లాడు. ఇదిలా ఉంచితే, రిమాండు ఖైదీగా గతంలో సంజయ్ 18 నెలలు జైల్లో వున్నాడు. శిక్షా కాలం నుంచి దీనిని కూడా మినహాయిస్తారు.

  • Loading...

More Telugu News