: చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ... మరికాసేపట్లో ఏరియల్ సర్వే


తమిళనాడు రాష్ట్రంలో వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం చెన్నైకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చిన మోదీకి అధికారులు స్వాగతం పలికారు. తరువాత చెన్నైలో వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో చెన్నై నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేయనున్నారు. మోదీ వెంట కేంద్ర బృందం కూడా తమిళనాడు చేరుకుంది. ఇప్పటికే కేంద్రం రూ.940 కోట్లు తమిళనాడుకు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News