: జీహెచ్ఎంసీ పరిధిలో తొలగించిన ఓట్లపై వివరణ ఇవ్వండి... సీఈసీకి హైకోర్టు ఆదేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓట్ల తొలగింపుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. నోటీసులు ఇవ్వకుండానే గ్రేటర్ లో 6.30 లక్షల ఓట్లను తొలగించారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. తమకు అందిన ఫిర్యాదుల ప్రకారం ఇంటింటి పరిశీలన చేశామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కోర్టుకు తెలిపారు. ఇంకా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి తమకు నివేదిక అందాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తొలగించిన ఓట్లపై ఈ నెల 10లోగా వివరణ ఇవ్వాలని సీఈసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.