: మూడు పరుగుల వ్యవధిలో కోహ్లీ, రోహిత్, సాహా ఔట్


కేవలం మూడు పరుగుల వ్యవధిలో టీమిండియా టాపార్డర్ లోని ముగ్గురు బ్యాట్స్ మన్ పెవిలియన్ చేరి ఉస్సూరుమనిపించారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో సఫారీ బౌలర్లు సత్తాచాటుతున్నారు. సఫారీ బౌలర్ పిడిట్ టీమిండియా టాపార్డర్ నడ్డి విరిచాడు. నాలుగు కీలక వికెట్లు తీసిన పిడిట్ టీమిండియా భారీ స్కొరు సాధించకుండా అడ్డుకున్నాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 63 ఓవర్లు ఆడి ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో మురళీ విజయ్ (12), శిఖర్ ధావన్ (33), ఛటేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (44) కాస్త రాణించగా, 136 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ కాగానే ఒక్క పరుగు జోడించి రోహిత్ శర్మ (1) పెవిలియన్ బాటపట్టగా, కీపర్ వృద్ధిమాన్ సాహా (1) మరో రెండు పరుగుల వ్యవధిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కేవలం మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు పడిపోయాయి. క్రీజులో అజింక్యా రహానే (41), రవీంద్ర జడేజా (10) ఉన్నారు. పిడిట్ నాలుగు వికెట్లతో రాణించగా, అబోట్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

  • Loading...

More Telugu News