: సెల్ఫీ దిగబోతుండగా ప్రమాదం... చివరికి ప్రాణాలతో బయటపడ్డ వైనం


సెల్ఫీ దిగబోతుండగా కాలు జారి అడయార్ నదిలో పడ్డ యువకుడు ప్రాణాలతో బయడపడ్డ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం అతలాకుతలమైంది. వరదనీరు రహదారులపైకి, కాలనీల్లోకి, ఇళ్లల్లోకి చేరింది. వరద నీటిలో కొట్టుకుపోయిన చాలా మంది మృతి చెందారు. వారి మృతదేహాలు పైకి తేలుతూ ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. టిఎన్ హెచ్ బీ క్వార్టర్స్ కు సమీపంలో ఉన్న కొత్తుపురంలో ఇటువంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడి అడయార్ నదిలో మృతదేహాలు కొట్టుకు వస్తున్న దృశ్యాలను చూసేందుకు ఇక్కడి ప్రజలు అక్కడికి తరలివస్తున్నారు. నది ఒడ్డున నిలబడి ఈ దృశ్యాలను చూస్తున్నారు. కొంతమంది గ్రామస్తులైతే సెల్పీలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది యువకులు బుధవారం నాడు అక్కడికి వెళ్లారు. అయితే, ఆ యువకుల్లో ఒకడు అదుపు తప్పి అడయార్ నదిలో పడిపోయాడు. దీంతో అతని మిత్రులకు దిక్కుతోచలేదు. అయితే, నదిలో పడ్డ యువకుడి అదృష్టం కొద్దీ, ఒడ్డుకు దగ్గరలోనే కొంచెం భాగం మునిగిపోయిన ఒక చెట్టు కొమ్మలు అతనికి అందాయి. వాటి సాయంతో బతికి బయడపడ్డాడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News