: చెన్నై బాధితులకు బాసటగా ఫేస్ బుక్...'సేఫ్టీ చెక్' ఫీచర్ ఏర్పాటు!


కుండపోత వర్షాలు, వరదలతో చెన్నై నగర జీవనం స్తంభించింది. చెన్నై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో, చెన్నై వాసులకు ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ బాసటగా నిలిచింది. తమ క్షేమ సమాచారాన్ని బంధువులు, స్నేహితులకు తెలియజేసేందుకు 'సేఫ్టీ చెక్' ఫీచర్ ను ప్రవేశపెట్టింది. చెన్నై వాసుల ఫేస్ బుక్ యూజర్ పేజీలో సేఫ్టీ చెక్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే తాము క్షేమంగా ఉన్నామనే సమాచారం అందరికీ చేరుతుంది. ఇటీవల ప్యారిస్ దాడుల సందర్భంగా కూడా ఫేస్ బుక్ ఈ సదుపాయాన్ని ప్యారిస్ వాసులకు కల్పించింది.

  • Loading...

More Telugu News