: ఏపీకి తక్షణ సాయం కింద రూ.330 కోట్లు ప్రకటించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ కు కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదలతో కొన్ని జిల్లాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయిన నేపథ్యంలో 2015-16 సంవత్సరానికిగానూ రూ.330 కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ సింగ్ ఇవాళ లోక్ సభలో వెల్లడించారు. వరద సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరిందన్నారు. వర్షాల ప్రభావం గురించి సిఎం చంద్రబాబుతో మాట్లాడానని, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర బృందం పర్యటిస్తుందని చెప్పారు. కేంద్ర బృందం నివేదిక తరువాత ఏపీకి మరింత సాయం చేస్తామని రాజ్ నాథ్ తెలిపారు.