: తొలి వికెట్ కోల్పోయిన భారత్


దక్షిణాఫ్రికాతో ఢిల్లీలో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ మురళీ విజయ్ కేవలం 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. డేన్ పిడిట్ బౌలింగ్ లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 26 పరుగులతో, పుజారా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు.

  • Loading...

More Telugu News