: దావూద్ ముఖ్య అనుచరుడి అరెస్ట్... నేపాల్ సరిహద్దు వద్ద పట్టేసిన ఐబీ, రా ఆఫీసర్స్


అండర్ వరల్డ్ డాన్, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడొకడు పోలీసులకు చిక్కిపోయాడు. భారత్-నేపాల్ సరిహద్దు వద్ద పక్కా సమాచారంతో మాటు వేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చి అండ్ అనాలసిప్ వింగ్ (రా) అధికారులు దావూద్ కీలక అనుచరుడు అబిద్ పటేల్ ను పట్టేశారు. గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఇద్దరు బీజేపీ నేతల హత్య కేసులో ఇతడు ప్రధాన నిందితుడు. ఈ హత్యల సమయం నుంచి అబిద్ పై నిఘా వేసిన ఐబీ, రా అధికారులు నిన్న అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దావూద్ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన జావెద్ చిక్నాకు అబిద్ స్వయానా సోదరుడట. దావూద్ కు సంబంధించిన వ్యవహారాలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న అబిద్ ను విచారించడం ద్వారా అండర్ వరల్డ్ డాన్ కు సంబంధించిన మరింత కీలక సమాచారం లభ్యం కానుందని ఐబీ అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News