: ప్రభుత్వ ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలి: సీఎం జయలలిత ఆదేశాలు


భారీ వర్షాలు, వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆమె ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. 450 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. ఇందుకుగాను సుమారు 96 బోట్లు వినియోగిస్తున్నారు. కాగా, భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం అతలాకుతలమైంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News