: నన్ను తొలగించే అధికారం ఎవరికీ లేదు: దానం నాగేందర్


గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించనున్నారనే వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి తనను ఎవరూ ఆహ్వానించలేదని తెలిపారు. వచ్చి కలవాలని మాత్రమే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు చెప్పారని వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, దానం నాగేందర్ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో, నాగేందర్ పై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News