: తమిళనాడు వరద బాధితులకు సంపూర్ణేష్ బాబు సాయం


భారీ వర్షాలతో తమిళనాడులోని జనజీవనం అస్తవ్యస్తమయింది. తాగటానికి నీరు లేక, తినడానికి తిండిలేక, ఉండటానికి చోటు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొస్తున్నారు. రజనీకాంత్, సూర్య, ధనుష్, విశాల్ లాంటి తమిళ నటులు ఇప్పటికే తమ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు కూడా తమిళ వరద బాధితుల సహాయార్థం రూ.50 వేలను ఇస్తున్నట్టు ప్రకటించాడు. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి ఈ మొత్తాన్ని అందజేస్తానని చెప్పాడు.

  • Loading...

More Telugu News