: రాజ్ భవన్ లిఫ్టులో ఇరుక్కుపోయిన అరుణాచల్ గవర్నర్!


అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్ ఖోవా ఇక్కడి రాజ్ భవన్ లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఆయన లిఫ్టులో వెళ్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 3 నిమిషాల పాటు ఆయన లిఫ్టులోనే ఉండిపోవడంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయినట్లు రాజ్ భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లిఫ్టులోని లైటు, ఫ్యాన్ కూడా పనిచేయలేదు. దీంతో గవర్నర్ వ్యక్తిగత భద్రతాధికారి సంబంధిత అధికారులకు ఎమర్జెన్సీ కాల్స్ చేయడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన గవర్నర్ జేపీ సంబంధిత విద్యుత్ శాఖాధికారులను పిలిపించి వారికి క్లాసు పీకారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఎందుకు ఉందంటూ వారిని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా మెరుగుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాజ్ ఖోవా ఆదేశించారు.

  • Loading...

More Telugu News