: షూటింగులో గాయపడ్డ హీరో సుధీర్ బాబు
టాలీవుడ్ లో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుని, ప్రస్తుతం బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న సుధీర్ బాబుకు గాయాలయ్యాయి. 'బాగీ' సినిమా షూటింగ్ సందర్భంగా సుధీర్ గాయపడ్డాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ ఫైట్ రిహార్సల్స్ సమయంలో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సుధీర్ బాబు ట్విట్టర్లో వెల్లడించాడు. మరోపైపు, హీరో టైగర్ ష్రాఫ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. టైగర్ ష్రాఫ్ చేసిన ఫైట్లు అద్భుతమని... హాలీవుడ్ సినిమాల్లో సైతం ఇలాంటి ఫైటింగ్ చూడలేమని చెప్పాడు.