: సినీ నటుడు వినోద్ కుమార్ కు బెయిలు
సినీ నటుడు వినోద్ కుమార్ కు పుత్తూరు జిల్లా ఐదవ అదనపు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత మేనేజర్ సచ్చిదానందపై హత్యాయత్నం కేసులో గత నెల 16న ఆయన అరెస్టైన సంగతి తెలిసిందే. తరువాత కోర్టు రిమాండ్ విధించింది. కొంతకాలంగా వినోద్ ఆర్థిక వ్యవహారాలను సచ్చిదానంద చూస్తున్నారు. అయితే తన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్టు అనుమానం రావడంతో మేనేజర్ పై వినోద్ హత్యాయాత్నానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మేనేజర్ కేసు పెట్టడంతో అరెస్టయ్యాడు.