: విజయవాడ నడిరోడ్డుపై సంచి, అందులో రూ.10 లక్షలు!
నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడలో కొద్దిసేపటి క్రితం వెలుగుచూసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చనీయాంశమైంది. నడిరోడ్డుపై పడి ఉన్న ఓ బ్యాగును తెరచి చూసిన స్థానికులు అందులో ఉన్న నోట్ల కట్టలను చూసి నోరెళ్లబెట్టారు. సాదాసీదాగా కనిపిస్తున్న ఆ బ్యాగులో రూ.10 లక్షల విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని చర్చించుకుంటుండగా, బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి సదరు బ్యాగును పడేసుకుని వెళ్లాడని తేలింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్న విషయం మాత్రం తెలియరాలేదు. నగరంలోని మొఘల్ రాజపురం సమీపంలోని భాష్యం పబ్లిక్ స్కూలు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్బు కట్టలను ఆసక్తిగా పరిశీలించిన స్థానికులు ఆ తర్వాత వాటిని పోలీసులకు అప్పగించారు.