: టి.శాసనమండలి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ శాసన మండలి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. స్థానిక సంస్థల కోటా కింద ఈ ఎన్నిక జరుగుతుంది. మొత్తం 12 మంది ఎమ్మెల్సీలను ఈ ఎన్నిక ద్వారా ఎన్నుకోనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 10న పరిశీలన జరుపుతారు. నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు ఉంటుంది. 27న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున... ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది.