: గుజరాత్ ‘స్థానిక’ పోరులో కమల వికాసం... హార్దిక్ పటేల్ వార్డును గెలుచుకున్న బీజేపీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిన బీజేపీకి గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలు కాస్తంత ఊరటనిచ్చేలానే ఉన్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాదు, సూరత్, రాజ్ కోట్, వడోదర, జామ్ నగర్, భావ్ నగర్... మొత్తం ఆరు మునిసిపల్ కార్పొరేషన్ లకు జరిగిన ఎన్నికలకు సంబందించి ఓట్ల లెక్కింపు నేటి ఉదయం ప్రారంభమైంది. తొలి ఫలితాలు విడుదలయ్యేసరికి అన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యం సాధించింది. వడోదరలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇక పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టి అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకే కాక రాష్ట్రంలోని బీజేపీ సర్కారుకు కూడా ముచ్చెమటలు పట్టించిన యువ సంచలనం హార్దిక్ పటేల్ సొంత వార్డులో కమలం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.