: రాజీవ్ గాంధీ హంతకులకు చుక్కెదురు... విడుదల చేయవద్దన్న సుప్రీంకోర్టు


మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. హంతకులను విడుదలచేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని చీఫ్ జస్టీస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ కేసును ఆ రాష్ట్రానికి చెందిన విచారణ సంస్థలు, పోలీసులు కాకుండా... కేంద్ర సంస్థ అయిన సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తు చేసి, విచారణ జరిపినందున వారిని విడుదల చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొంది. అంతేగాక హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని పేర్కొంది. కోర్టు నిర్ణయంతో రాజీవ్ హంతకులు జైల్లోనే శిక్ష అనుభవించనున్నారు. ప్రస్తుతం రాజీవ్ కేసులో మురుగన్, పెరారివలన్, శంతన్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా వారు సుప్రీంకు వెళ్లినప్పటికీ విడుదలపై కోర్టు స్టే విధించింది.

  • Loading...

More Telugu News