: సుప్రీంకోర్టు తీర్పును ఎల్లప్పుడూ గౌరవిస్తా: నటుడు గోవిందా
ఓ వ్యక్తిని కొట్టిన కేసులో అతనికి క్షమాపణ చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంపై బాలీవుడ్ నటుడు గోవిందా సానుకూలంగా స్పందించారు. కోర్టు తీర్పు ఏదైనా సరే దాన్ని గౌరవిస్తానని అన్నారు. తనకు ఎలాంటి అహంభావం లేదని, అంతేగాక కోర్టు తీర్పును ఎల్లప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. అయితే సదరు వ్యక్తికి తాను క్షమాపణ చెబుతున్నట్టా? లేదా? అనేది గోవిందా చెప్పలేదు. 2009లో గోవిందా తనను కొట్టారంటూ సంతోష్ రాయ్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. ఆ కేసు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లడంతో పైవిధంగా తీర్పు ఇచ్చింది.