: మాటల యుద్ధం ముగిసింది... రేపటికి వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు


దేశంలో ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగిన మత అసహనం అంశం పార్లమెంటు ఉభయ సభల్లో నిప్పు రాజేసింది. విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ స్నేహ హస్తం చాచిన నేపథ్యంలో పెద్దగా రభస ఉండబోదని భావించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. దేశంలో పెచ్చరిల్లిన మత విద్వేష ఘటనలపై అధికార, విపక్ష సభ్యులు మాటల కత్తులు దూసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నేరుగా బరిలోకి దిగారు. విపక్షాలపై ప్రధాని మోదీ ఓ స్థాయిలో ఫైరైతే, అంతకు రెట్టింపు స్థాయిలో అధికార పక్షంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దాద్రి ఘటన నుంచి గుజరాత్ పటేళ్ల ఆందోళనలు, రచయితల నిరసనలు... ప్రతి అంశాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. ఇక ఈ అంశంపై జరిగిన చర్చకు హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాధానమిస్తూ దాద్రి ఘటన వెనుక మత విద్వేషం లేదని తేల్చిచెప్పారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

  • Loading...

More Telugu News