: చిత్తూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన బస్సు... ప్రయాణికులు సేఫ్!


భారీగా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో, చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం తెల్లగుండ్లపల్లి వద్ద ఓ ఆర్టీసీ బస్సు వాగులో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు తిరుపతి నుంచి చిత్తూరు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News