: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో టీటీడీపీ, కాంగ్రెస్ పిటిషన్లు


తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కాలె యాదయ్య, రెడ్యా నాయక్, విఠల్ రెడ్డి, కనకయ్యలు తమ పార్టీలకు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని, ఇది పార్టీ ఫిరాయింపుల కిందకు వస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి వారిని అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో అంతకుముందే పిటిషన్ లు వేశారు. కొన్ని నెలల పాటు విచారణ కూడా జరిగింది. చివరికి ఈ అంశం స్పీకర్ పరిధిలో ఉన్నందున, తాము ఏమీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News