: చిదంబరం కొడుకు ఆఫీసుల్లో ఐటీ, ఈడీ సోదాలు!


కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కుటుంబానికి ఆదాయపన్ను శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు నేటి ఉదయం షాకిచ్చాయి. 2జీ కుంభకోణంలో భాగంగా ఎయిర్ సెల్- మ్యాక్సిక్ ఒప్పందానికి సంబంధించి జరిగిన ఆర్థిక అవకతవకల్లో చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నేత కార్తీ చిదంబరానికి ప్రమేయముందని ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేటి ఉదయం కార్తీ చిదంబరానికి చెందిన రెండు సంస్థల కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు చేశారు. కార్తీ చిదంబరం నేతృత్వంలో వాసన్ ఐ కేర్, అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ అనే రెండు సంస్థలు నడుస్తున్నాయి. నేటి ఉదయం ఈ రెండు కార్యాలయాలపై ఐటీ, ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ కార్యాలయాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News