: తెలంగాణ పోలీస్ శాఖ అవినీతికి నిలయంగా మారింది: కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖఫై కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్ విభాగం అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. ఇందుకు ఇటీవల ఏఎస్సై మోహన్ రెడ్డి వడ్డీ వ్యవహారమే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మోహన్ రెడ్డి అక్రమ దందాకు కారకులైన పోలీసు ఉన్నతాధికారులపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అంతేగాక ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో జిల్లాలో మావోయిస్టులకు సహకరించిన వేలాది మందిపై అనేక కేసులు పెట్టి పోలీసులు వేధించారని మృత్యుంజయం అన్నారు. అయితే అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.