: వరదలో కొట్టుకుపోయిన మహిళ ఓ వైద్యురాలిగా గుర్తింపు


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కాళంగి నది ఉప్పొంగుతోంది. సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. డక్కలి సమీపంలో వరద నీటిలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం నేడు ఒడ్డుకు చేరుకుంది. ఈ మహిళను వైద్యురాలు రాజ్యలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. ఇదే విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజ్యలక్ష్మి మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.

  • Loading...

More Telugu News